రక్తం పూసుకన్న నేల
రక్తం పూసుకన్న నేల
భూలోక స్వర్గం కాశ్మీరమైనా
పచ్చదనాల సోయగమైనా
మంచుపూలతో అబ్బురపరిచేదైనా
మనసు మురిసే ప్రదేశమైనా
కాశ్మీరానికి నెత్తుటి నేలలో తడవడం
ఇది కొత్తేమీ కాదు!ఎన్నెన్ని యుద్దాలు
జరగలేదూ!ఎందరి సతుల
గాజులు గుండె పగిలి రాలినవో!
నుదిట సింధూరంరక్తసింధూరమై
ఏరులైపారి ధరణంతా
ఎరుపెక్కిన కుంకమపువ్వుగా
మారలేదూ..?
రక్తం పూసుకున్న నేల రాసిన కవిత్వం
రక్తాశృవులతోనే తర్పణం..?
అది నిన్నటి దాకా మతోన్మాదానికి
ఇక చరమగీతం పాడదాం
మానవత్వపు మనుషులుగా
మిగులుదాం;
ఎన్నెన్ని కధలు కాశ్మీర లోయల్లో
కలిసిపోలేదూ!
కన్నీళ్ళతో వాగులు నిండిపోలేదూ!
ఎప్పటకప్పుడూ చరిత్ర చెబుతూనే ఉంది
అక్కడ నేల తడి ఆరక ముందే
కొత్త రక్తం పొర్లుతూనే ఉంటుంది
ఇంకా ఇంకా చెల్లించాలా మూల్యం
ఏమైపోతున్నది మనిషి మేధస్సు
అల్పమైపోతున్నాయి మనిషి ప్రాణాలు
మానవత్వపు జాడలు
తరిగిపోతున్నాయి,,
ప్రకృతి ప్రకంపనల కంటే పెచ్చు
పెరిగిపోతున్నాయి
మనిషి వికృత చేష్టలు
