కర్మ
కర్మ
అనుభవించాల్సిందే తప్పక.
వదిలిపోదు నిన్ను.
అన్ని గమనిస్తుంది మౌనం గా.
ఎవరి నుంచి అయిన తప్పించుకోవచ్చు
దీనికి అందరు సమానులే.
చేసిన వాటికి సమాధానం చెప్పాలి.
తప్పించుకుంటాను అంటే కుదరదు.
ఏదో రోజు వెతుకుంటూ వస్తుంది.
చేసిన తప్పులకు శిక్ష అమలు అవుతుంది.
ఎవరు చూడడం లేదు అంటు పొంగిపోకు.
కాల గమనంలో కర్మను సారమే.
నీతో ఉంటు నీ నీడల వెంటాడుతుంది.
అప్పుడు తెలిసి వస్తుంది అన్ని కళ్ళ ముందు
కనబడుతాయి.
చేసిన పాపాలకు ప్రాయశ్చితం కోరాల్సిందే.
మంచి చేయడానికి ప్రయత్నించు.
చెడు_మోసాలు చేసి తప్పించుకోలేవు కర్మ నుండి.
