STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

ఓ కల మిగిలే ఉంది

ఓ కల మిగిలే ఉంది

1 min
2



ఎవడు కనిపెట్టాడో 
దుర్గంధపు ఈ కులమనే కంపును?
ఎవడు నాటాడో మతమనే 
ఈ విషబీజాన్ని?
ఎవడు సృష్టించాడో జాతుల 
మధ్య ఈ అడ్డుగీతలను, హెచ్చుతగ్గులను?

ఉదయం లేచిన క్షణం మొదలు 
సామాజిక మాధ్యమాల్లో 
సమాజం నడిబొడ్డులో ఒకటే రోత 
కళ్ళిన వాసనలు "మనసును "
చుట్టుముడుతున్నాయి 

కులం పేరుతో 'అఘాత్యాలు'
మతం చాటున 'విద్వేష రాగాలు'
జాతిని నెపంతో 'అసభ్య దూషణలు' 
గిరగిరమంటూ చక్కర్లు కొడుతూ 
ఏదో చోట కనిపిస్తూ వినిపిస్తూనే ఉంటాయి

అధికారం కావాలన్నా 
ఆధిపత్యం చెలాయించాలన్నా
కుల మతం ఈ రెండింటిదే పైచేయి!
కాదని ముందడుగు వేయాలని 
ప్రయత్నిస్తే వెనక్కి నెట్టడానికి 
కొన్ని వందల అడుగులు సిద్ధంగా నిలుస్తాయి 

మనకు కనబడుతూనే ఉంటుంది 
ఏదో ఒక్క తోవలో నీడనిచ్చే 
మర్రిచెట్టు లాంటి గుణానికి 
స్థానం ఊరి వెలుపల !తగాదాలు రేపే 
కులం కుంపటికి మాత్రం ఊరి మధ్యనే 

ఓ కల మిగిలే ఉంది 
వన్యప్రాణులకు బదులుగా 
ఈ కులం మతం అంతరించి
మనిషిని మనిషిగా గుర్తించే 
వాతావారణ సమతుల్యత 
నెలకొంటే చూడాలని ! ప్రశాంతంగా బతకాలని....!


Rate this content
Log in

Similar telugu poem from Classics