కవితా పూరణం
కవితా పూరణం
దత్తపాదం :
" ఆయుర్ వృద్ధికి నిడదగు హాలాహలమున్ "
పూరణం :
క్షీర సాగర మధనమున తొలుత వెలువడినగరళమున్
క్షర జీవ రాసుల అక్షర యత్నము జేసెశ్రీకంఠుడున్ ర
క్ష జే యు పలు వైద్య విధాన పరంపరమాత్రల నందుదీ
క్ష చే రోగుల ఆయుర్ వృద్ధి కి నిడదగు హాలాహలమున్
ప్రతిపదార్థం :
1. క్షీర సాగర మథనం : పాల కడలిని చిలకగా
2. తొలుత వెలువడిన : మొట్టమొదటగా పుట్టిన
3. గరళమున్ : కాలకూట విషమును
4. క్షర జీవరాసుల : నశించి పోయే ప్రాణుల
5. అక్షర ప్రయత్నము : కొంతకాలము నశించి పోకుండగాచేసెడి
6. శ్రీ కంఠుడు న్ : గరళ కంఠుడు ( శివుడు )
7. రక్ష చేయు : రక్షించెడు&n
bsp;
8. పలు వైద్య విధాన : వైద్య విధాన పద్ధతులలో
9. పరంపర మాత్రల నందు : వైద్యగుళికలు / మాత్రలు , ఔషధాలు అందులో
10. దీక్ష చే : తయారుచేయు ప్రయత్నము తో
11. రోగుల ఆయుర్ వృద్ధికి : రోగులయొక్క ఆయుష్షు ను వృద్ధి పరచుటకు
12. నిడదగు హాలాహలమున్ : కొన్ని రకాల విషయాలను కూడా ఉపయోగిస్తారు .
భావం
పాల కడలిని చిలకగా మొట్టమొదటగా పుట్టిన కాలకూట విషమును నశించి పోయే ప్రాణుల కొంతకాలము నశించి పోకుండగాచేసెడి గరళ కంఠుడు ( శివుడు ) రక్షించెడు వివిధ వైద్య విధాన పద్ధతులలో వైద్యగుళికలు / మాత్రలు , ఔషధాలు అందులోతయారుచేయు ప్రయత్నము తో రోగులయొక్క ఆయుష్షు ను వృద్ధి పరచుటకు కొన్ని రకాల విషాలను ను కూడా ఉపయోగిస్తారు అంటే కాకుండా కొన్ని క్లిష్ట మైన వ్యాధులను రూపు మాపుతారని భావం.