STORYMIRROR

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

4.0  

Jayanth Kumar Kaweeshwar

Action Inspirational Children

పరివర్తన చేరని ప్రవర్తన .  వచన కవిత - కవీశ్వర్ -

పరివర్తన చేరని ప్రవర్తన .  వచన కవిత - కవీశ్వర్ -

1 min
185


పరివర్తన చేరని ప్రవర్తన .  వచన కవిత 

- కవీశ్వర్ - 25 . 02 . 2025 .

చదువు నేర్పుతానన్నా - కొందరి ఉపాధ్యా యులకు వినే, మరి కొందరికి వినని విద్యార్థులు 

చోదనలు రాసుకోమన్న - వినిపించుకొనని , పరీక్షలప్పుడు అడుక్కుంటూ తికమక పిల్లలు 

పాఠశాలకు ఎందుకు వస్తున్నామో తెలియక , సమయ నష్టం , ధన నష్టం పొందే శిష్యులు 

కొందరు తల్లిదండ్రుల గారాభానికి లోనై అటు తల్లి దండ్రుల , ఉపాధ్యాయుల మాటలు

                      పట్టించుకొ నని విద్యార్థులు 

పెడదారిని పట్టించే తెలిసి, తెలియని విపరీత ప్రవర్తన తో అందరికి చులకన గా అయ్యేవారు 

ఇలాగే ఎందుకు చెయ్యాలని , ఆలోచనలు, మేమే ఎందుకు చెయ్యాలని అనే పంతం వారి సొంతం 

మాకే ఎందుకు చెబుతున్నారు అని వారి నైపుణ్యం మరుగున పరచుకొని మిగితా పిల్లల బుద్ధి వక్రమార్గం 

ఎప్పుడు పడితే అప్పుడు ఆటలమీద ధ్యాస పెట్టె అందరిని ఇబ్బంది పెట్టి , తాము ఇబ్బంది పడే రకాలు.

తమ పిల్లల బాగుకు తమ వంతు కృషి చేసే గురువులు, వీరిని పట్టించుకోకుండా పిల్లలు, వారి                                                                  తల్లిదండ్రులు 

పిల్లలు గోరంతలు- కొండంతలుగా చేసి చెప్పే సిల్లీ విషయాలు - మా పిల్లలు చెప్పేదే నిజం మా పిల్లలు 

అబద్దాలు ఆడరు అని వెనుకేసుకొచ్చే అతి గారాభం చేసే వారి తల్లిదండ్రులు ,

వారి గురువులని సతాయిస్తూ , కేసుల ఉచ్చు లో తోసోసే సమాజం , తమ పిల్లల అభివృద్ధికి ఆటంకాలు కలిగించు కునే పేరెంట్స్. 

చెబితే వినకుంటే చెడoగా చూడరా, ఆ పిల్లాడిని సంజాయిస్తే వారి తల్లిదండ్రులనుండి ఇబ్బంది అని 

ఆలాంటి వారిని వదిలేయించుకుంటారు . ఆ పిల్లల అభివృద్ధే కుంటూ పడుతుంది. ఇలాంటి పోకడలను వికృత చేష్టలచే మంచి వారిని సతాయించే , చెబితే వినని మొండితనం వల్ల 

మార్చుకుంటేనే పరివర్తన లేకపోతె సమాజ కంటకులు గా మారడం ఖాయం.



Rate this content
Log in

Similar telugu poem from Action