STORYMIRROR

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Children

4  

Thorlapati Raju(రాజ్)

Tragedy Action Children

ప్రతి పనికీ..నువ్వే!

ప్రతి పనికీ..నువ్వే!

1 min
328


బాలికా.. ఓ...బాలికా!

మా అందరి భవితకు...

భవిష్యత్ ప్రణాళిక!


అనాది నుండి అందరికీ..

నువ్వంటే ఎంతో... తేలిక!

రాచరికం నుండి అందరకీ..

నువ్వే పరిచారిక!


ఇంట్లో నీటి కి..నువ్వే

సంపాదించే నోటు కి...నువ్వే

బట్టల షాపుల్లో నువ్వే

టిఫిన్ సెంటర్ల లో నువ్వే

డిపార్ట్మెంటల్ స్టొర్స్ లో నువ్వే

ఇక్కడ అక్కడ అని కాదు...

ప్రతి చోట నువ్వే...

ప్రతి పనికి నువ్వే...


బాలిక...

నువ్వు పడుతున్న బాధలు...చాలిక

ఆగిపోవలి 

నీపై జరుగుతున్న..అకృత్యాలిక!

అభాగ్యులు గా మార్చే...

అక్రమ రవాణా లు.. ఆపాలిక!

నిన్ను బలి తీసుకుంటున్న...

దుష్ట శక్తులు బలి కావలిక!


ఈ నాటికీ..

నీకు చదివెందుకు అంటున్న...

కుసంస్కారుల..కుయుక్తులు ఆగాలిక!

గర్భంలో నే..నిన్ను గాల్లో కలిపేసే...

గబ్బు నాయాల్లకు చరమగీతం పాడాలిక!


లేదంటే...

ఓ...బాలికా!

నువ్వింక కావలసిందే.... అపర కాళిక!

బాలికా... ఓ..బాలికా

అనుబంధాల... రాగ మాలిక

ఇకనైనా.. చెరిగిపోవాలి..

నీకున్న సరిహద్దు గీతలిక!


రావాలి ప్రతిచోటా...

సమాన ఏలిక!

నిజం కావాలి...

సంస్కర్తల....కలలిక!


బాలికా...

నువ్వే దేశానికి...దిశా దీపిక!

నువ్వు లేనిదే.  

భావితరాలు అనే...మాటే...లేదిక!


          ..... రాజ్.......



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Tragedy