భయం
భయం


కళ్ళు మూసుకొంటే చీకటి కలలు కనపడితే
కళ్ళు తెరిచి చూస్తే మనసు దిగులు వినబడితే
యదలో ఏదో భయం
కన్నీటి తుంపర్లు పడి ఉలిక్కిపడుతుంది మనసు
చీకటి స్వప్నం నీడై వెంటాడుతూ
నీవైపే తరుముతూ ఉంది
ఒక్క సారి నిన్ను చూడాలని
మనసు ఆత్రంగా చెపుతుంది
ఏ కారుమబ్బు నీ కమ్మేయలేదని నమ్మక మిమ్మంటూ
నాప్రాణమా నిన్నే కన్నీటి బిందువై అడుగుతుంది
అయినా కనులకు కనరాని నీ జాడే
ప్రతిరేయి ఒక భీతిగొల్పు స్వప్నమై
నను వేధిస్తావు
పరాయిదేశాన పైసలవేటలో గుమ్మం లోపలవేచిన
నీ ఆడది ధ్యాసే రాదాయె నీకు
మాటేరాని మనసుతో మౌనమా
మాటాడలేని సమయమా ఏకారణమో
ప్రతిచీకటివేళ ఓ జ్ఞాపకమై నవ్వించి ననుజోకొడతావు
తెలవారేవేళ పీడకళై నా నిదరని చెదరకొట్టి
నాకంటికి కన్నీరుని అరువిస్తావు