కలల సౌధం
కలల సౌధం

1 min

446
రెక్కలగుర్రంపై నా కలలసౌధానికి ఎగిరివెళ్ళాను
రతనాల రాదారిపై కమనీయ దృశ్యాలు
ఒక్కొక్కటి నను పలకరిస్తున్నాయి
పాలకోనేటిలో బంగారు కలువపువ్వులు
కోకిలమ్మ గానం నెమలమ్మ నాట్యం
అమృతాన్ని గ్రోలే అందమైన పక్షుల కువకువలు
పసిడి లేడి పరుగులు
చెంగుచెంగున గెంతే చెవులపిల్లులు
పచ్చని ప్రకృతిలో పరమళించే
రంగరంగుల పుష్పాలు
వాటిచుట్టూ పరిభ్రమించే సీతాకోకచిలుకలు
ఈ అద్భుతాలన్నీ చూస్తూ చివరికి
నాకలల రాకుమారుడి చెంతకు చేరాను
మనసుపంచే వేళయ్యిందంటూ
ఇంతలో మెలకువ వచ్చింది
మళ్ళీ నా నిరీక్షణ మొదలు
అతనికోసం కాదుసుమా
తననిచేరే స్వప్నాలరేయికోసం.