Ramesh Babu Kommineni

Romance

4.8  

Ramesh Babu Kommineni

Romance

అనుకోకుండా..

అనుకోకుండా..

1 min
34.4K


ప౹౹ అనుకోకుండా కలిసామే అనుమతి లేకుండా వినుకోకుండా ఉంది మనసే ఏమి తెలీకుండా ౹2౹ చ౹౹


నానాటి సొగసు నగీషి పెట్టిన అయస్కాంతం 

ఏనాటి కోరికో ఎదురూ చూడని ఈ ఏకాంతం ౹2౹


ఎప్పుడూ చూస్తున్నా కొత్తగా చూసినట్లున్నదే ఎన్నడు కనపడని విషయమేదో ఉన్నట్లున్నదే ౹ప౹ చ౹౹


కనిపించి కనిపించని నవ్వే నలిపేస్తుందే నన్ను అనిపించి అనిపించక ఊరక కొట్టేస్తుందే కన్ను ౹2౹


దాయనేల గుట్టూ దరిచేరకా దాటేసి ఆ గట్టూ ఖాయమేలే పట్టూ ఒకరినొకరూ కలిపేసే కట్టూ ౹ప౹ చ౹౹


మదిలో లోలకంలా ఊగే నీ జ్ఞాపకాలనన్నిటినీ మత్తులో జారనీ మరులతో ఇకనైనా కొన్నిటినీ ౹2౹


ఆవేశంతో ఊగేసే ఊహలకే కావాలి ఓ మార్గం ఆవురుమనే మనసుకే నువ్వే చూపాలి స్వర్గం ౹ప౹


Rate this content
Log in

Similar telugu poem from Romance