STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

కలలకేమి తెలుసులే…

కలలకేమి తెలుసులే…

1 min
255

కలలకేమి తెలుసులే కాంతామణి హొయలు

అలలకేమి తెలియదులే అధరాల బరువులు

మనసులో కోరికలే మయూరపు విన్యాసాలు 

ధనుసులో బాణంలా దరిచేరే ప్రియ హాసాలు

రాగమై అనురాగమై చెలి చెల రేగే చేరిపోయి

వేగమే ప్రణయమై మెరిసి ఎదలో జారిపోయి

కలలకేమి తెలుసులే కాంతామణి హొయలు

అలలకేమి తెలియదులే అధరాల బరువులు


ఇక...

కాలమే ఆగిపోనీ కడలి అంచులూ చేరేవరకు

కలమై సాగిపోనీ కవితలై విరియ పూచేవరకు

జ్ఞాపకాలగ మిగిలిపోనీ పదిలమై నిలిచేవరకు

వ్యాపకాలగ రగిలిపోని మరువక తలిచేవరకు

కోమలి చేసే విందులూ కోటి వరుసలుగా సాగే

జమిలి ప్రేమకు జన్మధన్యమై జాజులై కొనసాగే

కలలకేమి తెలుసులే ఆ కాంతామణి హొయలు

అలలకేమి తెలియదులే ఆ అధరాల బరువులు



Rate this content
Log in

Similar telugu poem from Romance