Sravani Gummaraju

Romance

3.7  

Sravani Gummaraju

Romance

విరబూసిన మకరందాలు

విరబూసిన మకరందాలు

1 min
579


నవమాసపు ఎడబాటులో అంతరంగపు హృదయనదిలో ఎల్లలు లేని ఎదురుచూపులు తారాడే ఆ తల్లి మోమున!!


అరవిరిసిన పువ్వులా ఆడించే ఆ కాళ్ళుచేతులు చూసి విప్పారేనే ఆ తండ్రి గుండెలో నిండు జాబిలి కళ్లముందుకొచ్చిందని!!


అక్షరాల తోటల్లో పువ్వులై విరిసి కొలువుల పానుపు మెట్లు ఎక్కుతుంటే గగనపు అంచులు అందుకున్నాడని గర్వించే ఆ గురుబ్రహ్మ!!


కలల కోటలో రెక్కల గుర్రంపై ఎగిరొచ్చే రాకుమారుడు కళ్ళముందు ఎదురైతే కన్నుల పండుగ అంతా కోటి దీప కాంతుల వెలుగులతో జిలుగు పూల వానై కురిసినకురిసిననాడు ఉప్పొంగే ఆనంద కేళి నాట్యమడే ఆ కన్నేమోమున!!


నిండు జీవితపు లోగిళ్ళలో అన్నింటా ఆశాభావాన్ని వెలిగించే ఆశాదీపాలు ఈ "ప్రేమ చూపులు"........


Rate this content
Log in

Similar telugu poem from Romance