STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

5.0  

Ramesh Babu Kommineni

Romance

నూనూగూ యవ్వనమా..

నూనూగూ యవ్వనమా..

1 min
357

నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా

తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా

పయ్యెదకే భారమే పలుకరించే ఆ చూపులు

సయోధ్యలే మరి సరసానికి మునుమాపులు

నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా

తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా


వలపంతనూ కోరిచేరనీ వచ్చి వలచేందుకూ

పిలుపంతను పీయూషమయి నిలిచేందుకూ

మనసంతను మసిలేను ఆ వింత మార్పును

సొగసంతనూ సోకులతో మరిచే కన్నార్పను

నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా

తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా


వచ్చిపోయే వసంతం ఒదిగే మదిలో సాంతం

మెచ్చిపోయే మెరుపు అంతా మేనికే సొంతం

కలిగించే హాయి కలబోసి కదనమై విరబూసి

తొలగించే ఆ బిడియాన్ని మనసారా చేరదీసి

తొలి వలపు తోరణాలే చుట్టేయ తనువంతా

మలి మలుపు మరులే ఎగసేనే అణువంతా


నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా

తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా

పయ్యెదకే భారమే పలుకరించే ఆ చూపులు

సయోధ్యలే మరి సరసానికి మునుమాపులు


అలా ఆకు వక్క కలిసేను బాగా పండేందుకు

ఇలా వయసు వలపే కలిసే పండగయేందుకు

అలా ఆకు వక్క కలిసేను బాగా పండేందుకు

ఇలా వయసు వలపే కలిసే పండగయేందుకు

నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా

తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance