అది కలే
అది కలే
ప౹౹
తెలియని సౌఖ్యమేదో తెలిసిందీ కొత్తగా
అలియని మనసూ ఆలకించెనే మెత్తగా ౹2౹
చ౹౹
ఏ దివ్య గానమో అది ఎద పులకించెగా
ఆ పది రెండు స్వరాలూ అవలోకించగా ౹2౹
జనక రాగంతో జనియించే భవ్యసుమం
కనక కాంచనాలూ కాలేవు దానికి సమం ౹ప౹
చ౹౹
పండువెన్నెల ప్రభవించిన పున్నమిరేయి
పండుగల్లే ఆ స్వరం కూర్చ చల్లనిహాయి ౹2౹
జావళీ జాలు వారినే సెలయేటీ నడకలా
కాహళీ జత చేరే ఎచటనుండో వేడుకలా ౹ప౹
చ౹౹
మోదంతో మనసూ ఆమోదం తెలుపగా
హృదయమే ఆ ముదం మళ్ళీ తలుపగా ౹2౹
కానరాని పారవశ్యం కళ్ళకు కట్టినట్లాయె
చేరలేని సుఖమంత చెంతకే చేరినట్లాయె ౹ప౹
చ౹౹
ఆ స్వప్నమే నిలిచెలే ప్రేరణగా నా రచనకు
ఆ కలయే ఊతము నా మొదటి సృజనకు ౹2౹
ఊహల ఉరవడికీ చేయూత ఆ స్వపమేలే
కలల వరవడి కలంనే నడిపించు నిజమేలే
౹ ప౹