మయూరం
మయూరం
ప౹౹
మయూరమా మదిని దోచిన వలపు వయారమా
ఆహార్యమూ చూడగనే ఎదలో ఏదో యవారమా ౹2౹
చ౹౹
తలపు విహాంగం తరలేను తన్మయత్వం నింపేసి
కలుపు సాంగత్యం కనులతో సందేశము పంపేసి ౹2౹
మరపున బెడదచే ఉల్లాపములతోనే సరీ పెట్టకా
వెరపున ఎడద గోలా సల్లాపముతో గురి పెట్టాకా ౹ప౹
చ౹౹
జాణకోసం ప్రాణమే పణమొడ్డారులే ప్రేమకోసం
గణగణ ప్రేంకారం మోగాక వెదకాలిలే అవకాశం ౹2౹
తన్మయం తనువులోకి వచ్చాక నిలువనేలేరుగ
అతిశయం అదుపులో పెట్టక పోతే ఉండలేరుగ ౹ప౹
చ౹౹
చిరువెన్నెల సరిలేదన్నది సమానమై సరసానికి
కోరుకున్నది కొత్తరంగులే అద్దినది దరహాసానికి ౹2౹
రుచి తెలిసాక రూక్షమైన ద్రాక్ష తేనెలొలుకునూ
నచ్చి బాగానచ్చినా ప్రేమ తీయగా కులుకునూ ౹ప౹