వెన్నెల్లో
వెన్నెల్లో


వెన్నెల్లో మెరిసిన మోమునూ చూసే వేళల్లో
తనువుల్లో పొంగిన తమకం చూపే కళ్ళల్లో
వెన్నెల్లో మెరిసిన మోమునూ చూసే వేళల్లో
తనువుల్లో పొంగిన తమకం చూపే కళ్ళల్లో
తనివి తీరక ఆ తంటాలమారి తగలాటమో
మనవి చేయనే మనసుకేమో ఓ ఆరాటమో
ఎంతెంత మోహం ఎరుపెక్కిన ఆ వదనంలో
ఇంతింతని చెప్పలేను వివరముగ కథనంలో
కలిసొచ్చే కాలమే కలలోను చెప్పింది కవనం
అలసిచ్చే మనసా ఇక పూయించే కొత్త వనం
ఊహించే ముందుగ ఊకాట్టిసాగే ఊసులేమో
భావించి మదిలో ఉయ్యాలూగే సొగసులేమో
వెన్నెల్లో మెరిసిన మోమునూ చూసే వేళల్లో
తనువుల్లో పొంగిన తమకం చూపే కళ్ళల్లో
లేత వయసు లేమకే లెక్కలేని వయ్యారాలు
పాతబడని పద్దతిలోనే సాగనీ వ్యవహారాలు
మెరిసి మురిసే మోముతో అన్ని మురిపాలు
వెరసి చూస్తే వెరవని ప్రేమైక కార్యకలాపాలు
వెన్నెల్లో మెరిసిన మోమునూ చూసే వేళల్లో
తనువుల్లో పొంగిన తమకం చూపే కళ్ళల్లో
వెన్నెల్లో మెరిసిన మోమునూ చూసే వేళల్లో
తనువుల్లో పొంగిన తమకం చూపే కళ్ళల్లో