ప్రేమ
ప్రేమ


మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె
మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె
కొలమానం లేనిదొకటి సృష్టిలోన ఉన్నదిలే
మాధవుడై పుట్టాలని నరునికెంత ఆత్రమాయె
మావిచిగురు మెసవుతున్న కోయిలమ్మ గొంతువిప్ప
వసంతాన్ని పిలిచేందుకు ధరణికెంత ఆత్రమాయె
రాధమదిని నిండిపోయి ప్రేమసుధలు పొంగుతుంటె
విశ్వప్రేమ పంచగాను మరునికెంత ఆత్రమాయె
కనులముందు నిలుచున్నా నీవెవరో తెలియలేదు
నీజాడను వెదకాలని రాంకికెంత ఆత్రమాయె