తమసోమాజ్యోతిర్గమయ
తమసోమాజ్యోతిర్గమయ


మానవ జీవితం అంధకార బంధురం
పుట్టేంతవరకూ తల్లిగర్భమనే అంధకుహరం లో
పుట్టుకతోనే వెలుగువైపు పయనం
ఐనా వెంటాడే అజ్ఞాన అంధకారం
విద్య నేర్వడం ద్వారా మానవ మేధలో
వెలుగుతుంది చిరుదివ్వె
గురువు పోసిన జ్ఞానతైలం సరిపడినంతా ఉంటే
మానవ జీవితం వెలుగువైపు పయనం
ఒక జ్యోతి వెలిగితే వేలజ్యోతులను వెలిగిస్తుంది
కానీ అహంకారం ఈర్ష్య అసూయలనే తిమిరాలలో
శ్లేష్మంలో పడ్డ ఈగలా కొట్టుకుంటూ
తనచుట్టూ మరింత చీకటిని పెంచుకుంటూ
జీవితంలో వెలుగులేదని వాపోవడంమానవ సహజం
సమాజానికి ఉపయోగపడాలనే తపన ఉంటే
స్వార్ధాన్ని పక్కన పెట్టి దివ్య జ్యోతిలా వెలగాలి
ప్రపంచాన్నంతా ఉద్దీప్తం చేయాలి
అదే మానవ జీవన పరమార్థం