మనసు - వరమా? శాపమా?
మనసు - వరమా? శాపమా?


మనసు గతులు అన్ని సంగతులు
స్థితులు అన్ని అనుభవములు
భావముల వాము మనసు; ఆహారము మన అందరకు
ఇచ్చును పుష్టి, తుష్టి; పరమేష్ఠి కరుణ మనసు సోయగము
శబ్దము లేని అలజడి
మనసు సవ్వడి, సడి, సుడి
రూపు లేని భ్రమలు
దాని గంతులు, పొంగులు, క్రుంగులు
దాని సడులు తిప్పు సుడులు
దాని మడులు యువతకు పీడలు;
దాటిన వారికి "అమృత భాండముల" పానము
ఆ పై ఆగని కోరికల మంటలు
మనసు చెలియ, రిపుడు
మనం ఉపయోగించడాన్ని బట్టి
కలిగించును సడులు, తీపులు, తీపులు
వాపులు, వలపులు, తలపులు, విలాపములు
అన్ని బంధములకు విరాగములకు కేంద్రము
వెతల, వేదనల, ఉత్సాహముల సంద్రము
మనసు; మనుషులకు ఒక సొగసు
ప్రకృతి ఇచ్చిన వరము?; శాపము?
మనసు ప్రకృతి రూపము
ఆత్మ ప్రతిరూపము