అనుబంధం
అనుబంధం


రెండు జీవితాలని కలపడానికి పునాదిగా కదిలి ఆశల్ని ఆశయాల్ని కలుపుతూ సాగింది.
ఆశాయాల్ని చేధించే క్రమంలో సాధ్యా సాధ్యాలైన సవాళ్ళను ఎన్నో విసిరింది.
సవాళ్లని ఎదుర్కొనే దిశగా వ్యక్తిత్వ, జీవన నైపణ్యాలని సమకూర్చింది.
పరుగాపని వేగంతో పయనించి ఊపిరి సలపని ఆశయాల వారధిని దాటుతూ ఆశల పల్లకిని చతికిల పరిచింది.
ఆశయ, నైపుణ్య , సవాళ్ళ, పాఠాల చక్రాల కింద ఛిధ్రమై అనుబంధం ఓ ప్రశ్నగా మిగిలింది.
అనుబంధం కనుమరుగైంది.!!