" నిద్రేడున్నది? "
" నిద్రేడున్నది? "


" నిద్రేడున్నది? " - RK
కాలిన కడుపులకి నిద్రేడున్నది
కాసులెంటా పరిగెత్తినోడికి నిద్రేడున్నది
కన్నీళ్లే జీవితమైనవాడికి నిద్రేదున్నది
కలహాలే కలలైనవాడికి నిద్రేడున్నది
కలతలున్న సంసారానికి నిద్రేడున్నది
ఆఫీసులో అంటించుకొని ఇంటికి పనితీసుకొచ్చినా
భర్తకి భార్య ఎదలో నిద్రేదున్నది
దేశ రక్షణకోసం భర్తని పంపి, దేహంలోని కోరికల్ని
చంపి మసకచీకటి మత్తులో వాలిన వీరవనితకి నిద్రేడున్నది
దేశ రక్షణే ధ్యేయమని, తమ దేహమే దేశానికనీ
చలి మంచుటెండల్లో, వర్షపు జల్లుల్లో వణికి తడిసిన వీర సైనికులకు నిద్రేడున్నది
ఇంటికి తాగొచ్చిన మొగడి మోటుతనానికి ఛిద్రమైన
తన శరీరాన్ని శిథిలంగా మారనివ్వకుండా కనురెప్ప వేయగానే పసిపిల్లోడి ఏడ్పు విని శక్తినంతా కూడగట్టుకొని లేసిన సగటు భార్యలకు నిద్రేడున్నది
వర్షపు జడిలో, చలి మంచు ఒడిలో తడిసిన చీకటిలో ఫుట్ పాత్ పై పడుకునే సామాన్యులకు, శ్రామికులకు, యాచకులకు నిద్రేడున్నది
దేశ సంస్కృతిని పక్కనపెట్టి పాశ్చాత్య సంస్కృతికి పబ్బం కట్టి, పబ్బుల్లో అర్ధరాత్రి వరకు ఎగిరి
గంతులేసే ఎర్రతోలు భామలకు నిద్రేడున్నది
చేతుల్లో చరవాణితో మరిగి, రెప్ప మూయలేని
కన్నులు కరిగి, ఒంట్లో కదల్లేని ఎముకలు విరిగినా సొల్లు కబుర్లతో సోయి లేకుండా కదల్లేకుండా పడున్న సోంబేర్లకు నిద్రేడున్నది
సమాజాన్ని కదిలించలేని అందమైన అక్షరాలని
ఏర్చి కూర్చి రాయలేని నా కలానికి కూడా నిద్రేడున్నది?
-RK