STORYMIRROR

EERAY KHANNA

Abstract Classics Inspirational

4  

EERAY KHANNA

Abstract Classics Inspirational

ఊగిసలాడే ఉగాది

ఊగిసలాడే ఉగాది

1 min
371

        ఊగిసలాడే ఉగాది - రాజేష్ ఖన్నా

             =========================

యుగానికి యవ్వనాన్ని తొడిగి

పాత కాలాన్ని వన్నెలతో కడిగి

అప్పుడే పుట్టిన వసంతాన్ని అడిగి

వలపు వయ్యారాల వాకిలిని తాకి

మనసుల్లోకి మకరంధాల్ని చేర్చి

షడ్రుచులతో మమకారాన్ని కూర్చి

పచ్చడి గరిటలతో గలగలలాడింది

ఉలుకులేని ఉత్సవానికి ఉరుకులు తెచ్చి

ఉషారైనా ఉత్సాహానికి ఉప్పెనలిచ్చి

ఎగిసిపడిన సంతోషాన్ని పండగలా మార్చి

ఎండిపోయిన జీవితానికి చిగుర్లని పేర్చి

ఏరువంకల, ఎడ్లబండ్ల వెక్కిళ్ళని మాన్పి

అరిగిపోయిన అనుబంధాల్ని అతికించి

అలసిపోయిన కాలాన్ని కళతో బతికించింది

యుగానికి, ఉత్సవానికి ఆరంభమైనా

వనాలకు వన్నెలద్దే వసంతమైనా

మొక్కుబడి మనుషుల ఉత్తమ నటనలో ఊపిరిసలపని ఊగిసలాటలో

ఊపిరాడని ఉగాది పండగ

ఉత్సహాన్ని తేకపోతే దండగే కదా

ఊపిరిలేని గాలిమనుషులకు

ఉత్తమమైన నకిలీ మనసులకు

పోలికలేని పోల్చుకోలేని మార్పుని

అందించి ఆరంభమయ్యేదే అసలైన

యుగాది, అదే ఉత్తమైన ఉగాది

         ***** సమాప్తం *****



Rate this content
Log in

Similar telugu poem from Abstract