STORYMIRROR

Myadam Abhilash

Abstract

4  

Myadam Abhilash

Abstract

తెలుగు బంధం

తెలుగు బంధం

1 min
90

అచ్చులు హల్లులు అమ్మా నాన్నలు


భాషాభాగాలు బాబాయీ లు


పదబంధాలు పలకరించే పిన్నమ్మలు


అన్నయ్యలు అన్నింటికీ అలంకారాలు


ఒత్తుల వరసలు వదినమ్మలు


తమ్ముళ్లు తోడుండే తెలుగు వెలుగులు


ఛందస్సే చిలక పలుకుల చెల్లెమ్మ


విద్యనందించే లఘువులు, గురువులు


బహువచనాలు బావమరుదులు


సంధులు, సమాసాలు చుట్టాలు పక్కాలు


విభక్తులు వీధి స్నేహితులు


ప్రతిపదార్థాలు ప్రాణ స్నేహితులు


విమర్శించే వాళ్ళు వ్యతిరేక పదాలు


సమర్థించే వాళ్ళు వ్యుత్పత్తర్థాలు


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract