సాటి లేని తెలుగు
సాటి లేని తెలుగు


తెలుగు భాష ఎంతో మేటి,
మన భాషకు లేదు ఎవరితో పోటీ |౧|
తేట తేట తెలుగు పదాల మాధుర్యం తనకు తానే సాటి,
ఎందరో మహానుభావులు మహనీయులు అయ్యారు ఆంధ్రభాషలో ఘనాపాఠి|౨|
మన ప్రతి మాట పాట ఒక తెలుగు తేటి,
మన నాడులో ఇద్దాం తెలుగు ప్రాధాన్య స్థానం మొదటి |3|
తెలుగుతల్లి సంతోషిస్తారు మన ఐక్యత తోటి,
తెనుగు ఎప్పుడు ఉండాలి సంస్కృతి కావ్య సాహిత్య కిరీటి |౪|
పరభాష వ్యామోహం ఎప్పుడూ కాదు లాభసాటి,
అరుదైన శాస్త్రీయ ప్రాచీన భాషలందు తెలుగు వాక్కు వాఙ్మయం ఒకటి |౫|
తెలుగు భాషాభివృద్ధి కొరకు ఆంధ్రుల అభ్యర్థనలు కోటి కోటి,
మాతృభాష సంరక్షణకు తెనుగు విద్వాంసులకు దండాలు శతకోటి |౬|
ఆనాటి ఈనాటి మాటల బంధం కొరకు అయ్యెను తెలుగు సృష్టి,
నేర్పరులు ప్రసాదించారు లిపి శిలాఫలకాలు గ్రంథాలు ఉంచుకుని దూరదృష్టి |౭|
నిరంతరం అవుతూ ఉండాలి తెలుగు భేటి,
ప్రత్యేక పద్య గద్య రచన ఒక అమూల్యమైన తెలుగు చీటీ |౮|
తెలుగు భాష వాడుకలో ఉండాలి సార్థకమైన ప్రయోగాత్మక పరిపాటి ,
మన తల్లిభాష పోషణ రక్షణ లేకపోతె ఏనాటికి మన విలువ ఎంతపాటీ ఎంపాటీ| ౯ |