Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!
Unveiling the Enchanting Journey of a 14-Year-Old & Discover Life's Secrets Through 'My Slice of Life'. Grab it NOW!!

Raja Sekhar CH V

Abstract Classics Others

4  

Raja Sekhar CH V

Abstract Classics Others

అమోఘ మేఘమాల

అమోఘ మేఘమాల

1 min
335


అమోఘ మేఘమాలతో కనువిందు అయ్యెను నీలమైన అనంత ఆకాశం,

మేఘజ్యోతి మేఘనాదంతో ఆర్ద్ర శీతలప్రద వర్షపాతం చేసెను ప్రవేశం,

చిరుజల్లు చిటపట చినుకులతో అనార్ద్ర వసుంధర పొందెను పరవశం,

తరులతల ఆకులపై వర్షపు చుక్కల నృత్యం ఓ అందమైన సన్నివేశం |౧|


ఝంఝతో స్తంభించిన ప్రకృతిలో మఱల వచ్చెను క్రొత్త లయం,

నీరస ఊసరక్షేత్రంలో హరిత శోభన తేవటంలో చేసెను సహాయం,

జలధరులు జలకళతో ఊరక జలాశయాలను చేసెను జలమయం,

అనుపమ ఉపవన సరోవరాలలో విమల జలం ఎంతో అద్వితీయం |౨|


ఘనాఘన మబ్బుల తెర వెనుక దాగెను సూర్య చంద్ర తారాగణం,

వీక్షించవలెను సప్తరంగుల ఇంద్రధనుస్సు ఇంద్రజాల నిర్మాణం,

వానజల్లుతో నిర్మలమయ్యెను ఇహలోకంలో ప్రాకృతిక వాతావరణం,

ధరణిపై కమనీయం రమణీయం ఈ అమోఘ మేఘమాలల వర్షణం |౩|



Rate this content
Log in

More telugu poem from Raja Sekhar CH V

Similar telugu poem from Abstract