ఏమైందీ నగరానికి
ఏమైందీ నగరానికి
ప్రపంచ మంతా వణికిస్తోంది వైరస్ కరోనా
గడగడలాడిస్తోంది ఎంత గొప్ప దేశాన్నైనా
క్షణాలలో చుట్టు ముడుతోంది ఎందరినైనా
తప్పలేదు స్వీయ నిర్బంధనం మనదేశానికైనా
ఆర్థిక లోటు రాష్ట్రాలన్నింటినీ కలవర పెడుతోంది
'మద్యం' లోటు తీర్చే మార్గమని వ్యవస్థ భావించింది
ఇది కొందరి అస్వస్థతకు, మరణాలకు కారణమైంది
అది ప్రజలలో మరింత భయం, ఆందోళన పెంచింది
దురదృష్టం, విశాఖ ప్రజలకు మారింది శాపమై
ఎల్.జీ.పాలిమర్స్ రూపాన విష వాయువై
ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు అస్వస్థులై
ఆయువు తీసింది కొందరిది ఇది విషతుల్యమై
సూక్ష్మ క్రిమి, మద్యం, విషవాయువు, ఎన్నో బాధలు
చుట్టు ముట్టాయి ఒకేసారి వారిని అన్ని ఆపదలు
కాపాడగల వారెవరు, ఏవి చేయూత నిచ్చే చేతులు
స్పందించే వారెవరు, వినేది ఎవరు వారి ఆర్తనాదాలు
కరోనాతో, ఆర్థిక భారంతో ప్రపంచం మొత్తం పోరాడుతోంది
ఇవికాక విషవాయువు విశాఖ వాసులను చుట్టుముట్టింది
ఏ దైవ శక్తి వారిని ఈ మహా విపత్తు నుండి కాపాడుతుంది
ద్రవించిన కవి హృదయం, వారికై దేవుని ప్రార్థించింది