నూతన వర్ష శుభాకాంక్షలు
నూతన వర్ష శుభాకాంక్షలు
గుర్తుంచుకొని గతకాలపు చిటికెడు మధురక్షణాలను
మరపు తెరవేసి కొండంతటి నష్ట కష్టాలను
ఆశగా చూస్తూ రాబోవు తెరవని పేజీలను
ఆహ్వానిద్దాం 2022 నూతన సంవత్సరమును
పెద్దలు నుడివినట్లు గతము గతమే
భవిష్యత్తు ఎవరి ఊహలకు అందనిదే
వర్తమానము సహితము సజీవ క్షణమే
మరు క్షణము ఏమౌనో తెలియనిదే
కనుక భవిష్యత్తు కై కలలు కనండి
సజీవక్షణంలో సాకారం చేసుకోండి
నూతనవర్ష శుభాకాంక్షలతో
మీ రామశేషు