సాధించిందేమిటి?
సాధించిందేమిటి?
ఇన్నేళ్ల స్వతంత్రం తో సాధించిందేమిటి?
సాధించాం సాధించాం
పేదవాడి బతుకు లో
ఆకలి కేకలు సాధించాం!!
రైతన్నల కష్టాలని తరిమే
ఉపాయం ఆత్మహత్యే
అనిపించేలా సాధించాం!!
అత్యాచారాల రక్తపు
మాడుగులో రాక్షసులని
ఎందరినో సాధించాం!!
బాల్య వివాహాల లో
ఇరుక్కుపోయిన
కన్నీటి చుక్కలుసాధించాం!!
బాల కార్మికుల వ్యవస్థలో
వేలల్లో కార్మికులను సాధించాం!!
చెప్పలేనన్ని దుర్గతి అద్బుతాలు సాధించాం!!