STORYMIRROR

Keerthi purnima

Drama Fantasy Inspirational

4  

Keerthi purnima

Drama Fantasy Inspirational

నాకో లోకం కావాలే

నాకో లోకం కావాలే

1 min
326

నాకో లోకం కావాలే


కుళ్లు కుతాంత్రాలకి సోటు లేని

సక్కనయిన లోకం కావాలే

జరంతా మదికి నచ్చే బట్ట కట్టుకొనే

సెచ్చ ఉండే లోకం కావాలే

ముందరా కోయిలమ్మ ల

యేనకలా గోతులు తవ్వే గుంటనక్కలు

లేని లోకం కావాలే

పడే కట్టానికి తగ్గ ఫలితం

కోసం ఎదురుసుడని లోకం కావాలే

మధ్యతరగతి బతుకుల్లో

మార్పు తెచ్చే లోకం కావాలే

కుల మతాల ప్రవాహానికి

అడ్డుకట్ట వేసే లోకం కావాలే

అధికారం సూసి నెత్తి మీద పెట్టుకొని

కుప్పి గంతులు వేసే లోకం పోయి

బుద్ధిని సూసి కాళ్ళు గడిగే లోకం కావాలే

మెచ్చుకోలు మాటల కొరకు

యాస బాషలని కైదు సేసే లోకం పోయి

ధైర్యంగా సొంత యాసల

మాట్లాడే లోకం కావాలే

ఇయాన్ని జరగాలంటే

మనలో మార్పు రావాలే!!

అది ఈ క్షణమే మొదలు కావాలే!!



Rate this content
Log in

Similar telugu poem from Drama