ద్రువతార
ద్రువతార
చిరు ఆశల బాల్యం బందీఅయింది
బడిసంచుల అరల మధ్యలో
తరిగిపోయింది పెన్సిలోలే
ర్యాంకుల ద్యాసాలో
బానిస వోలె దాస్యం చేస్తుంది
యాంత్రికపు కట్టుబాటులో
మారాలి ఇకనైనా ఈ లోకం
లేదంటే పడదు స్వియ ఆలోచనలకి బీజం
నూతనత్వం లేదంటే ఆగిపోతుంది కాలం
ముగియవలసిందే లోకంలో మృత జీవనం
నేర్పించవలసిందే చిన్నారులకు సమాజంతోసహజీవనం
బడి పుస్తకాలతో చేయిస్తే సరిపోదు విద్యాభ్యాసం.
బతుకు సారం బోధిస్తినే అగును జీవితాలు సర్వంగా సుందరం
ఆశలకే అవకాశం లేనప్పుడు
ఆవిష్కరణపు ఆలోచనలకి పునాదులేక్కడివట.
పునాది లేని కోట కూలెందుకు
క్షణ కాలం చాలునట