STORYMIRROR

Ramesh Babu Kommineni

Inspirational

4.9  

Ramesh Babu Kommineni

Inspirational

తెమ్మెర

తెమ్మెర

1 min
598


ప౹౹

తెమ్మెరా తెరలేపే తెగువతో ఆ వలపునే

అరవైలో బరిలోకి దింప ఇచ్చే పిలుపునే ౹2౹


చ౹౹

అరవైలలో ఇరువది సాధ్యము పరికించ

నెరవైన నెమ్మి నెమ్మదిగా మది ఆలకించ ౹2౹

కలిగినే ఎదలో ఏదో భావం ఎదురీదినట్లు

చెలగి వలపు సమీరం పట్టిపట్టి లాగినట్లు ౹ప౹


చ౹౹

మనసుకే లేదుగా ఆ వయసనేది ఎంచగ

యశస్సులే వేడుకగ తనువునే ఊరించగ ౹2౹

కొత్త కోరికలే జిమ్మని ఎడదలో జనించలే

మత్తు పెరిగి మస్తిష్కం మాయలోఉంచిలే ౹ప౹


చ౹౹

ముదిమి ముంచునని మరి ఆ భయమేల

అదిమి ఉంచిన ఆంక్ష సడలనీ జయమేలే ౹2౹

అరవైఏండ్ల యువకుడా ఆలస్యమెందుకు

ఇరవైఏండ్ల వాడిలా పరిగిడివా ముందుకు ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Inspirational