STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

మనసులేని బొమ్మ

మనసులేని బొమ్మ

1 min
327

మనసులేనీ బొమ్మవులే నీవు కూడాను

వయసులోని ఉరకలే కనలేదు తేడాను

మనసులేనీ బొమ్మవులే నీవు కూడాను

వయసులోని ఉరకలే కనలేదు తేడాను

ఎంత కఠిన హృదయమో వేరే చెప్పనా

అంత కఠోరమే ఆ భావం ఇక తప్పునా


మనసులేని మనిషివని నిరూపించావు

అలుసు చేసి ఆ కథలను నడిపించావు

అద్దమంటి మదిని అలా పగలగొట్టావు

వద్దామంటే వలపులన్నీ తగలబెట్టావు

కలసిరాని కాలంలో కలలు కూడ రావు

అలసిపోని ఆశలు అసలు వదలి పోవు

మనసులేనీ బొమ్మవులే నీవు కూడాను

వయసులోని ఉరకలే కనలేదు తేడాను

ఎంత కఠిన హృదయమో వేరే చెప్పనా

అంత కఠోరమే ఆ భావం ఇక తప్పునా


చరిత్రలో ఇలాటి కథలెన్నో వినేందుకు

ధరిత్రికి కొత్తకాదే వ్యధలన్నీ కనేందుకు

కలియని దారులలోనే మన పయనం

తెలియని తీరులలోనే ఇక ఆ గమనం

కలియని దారులలోనే మన పయనం

తెలియని తీరులలోనే ఇక ఆ గమనం

మనసులేనీ బొమ్మవులే నీవు కూడాను

వయసులోని ఉరకలే కనలేదు తేడాను

ఆ తేడాను....తేడాను



Rate this content
Log in

Similar telugu poem from Romance