STORYMIRROR

Ramesh Babu Kommineni

Romance

4  

Ramesh Babu Kommineni

Romance

వీచే గాలికి తెలుసు

వీచే గాలికి తెలుసు

1 min
413

వీచే గాలికి తెలుసూ వీడని వలపు సుగంధం             

చూచే కనులకు తెలియదా కలిసున్న బంధం

కలిసిపోయే హృదయాలకు కాలం తెలియదే

అలసిపోని ఆశయం తీరం చేరికకే అలియదే

ఎడద ఊసులూ ఏడు అడుగులతోనే ధన్యం

బెడద లేని ప్రేమే తొలగించు ఎదలోని దైన్యం

వీచే గాలికి తెలుసూ వీడని వలపు సుగంధం             

చూచే కనులకు తెలియదా కలిసున్న బంధం


పలుకనేర్చిన భావము పరిణితి చెందిపోయి

కులుకు కూర్పుల మదిలోన దాచింది హాయి

ఏ సూత్రం రాసిపెట్టి ఉండదు ఎంత ప్రేమకైన

ఆ మంత్రం తెలుసూ ప్రేమికునికైన భామకైన

మరచిపోని జ్ఞాపకాలై మిగిలేది మధుర ప్రేమ

అరచి చెప్పలేని అమృతం అసలయిన ప్రేమ

అలవోకగా చిలికి చినుకులయే సుధా రసమే

కల వాకిలిగ కన్నుల్లో కురిసే మధుర హాసమే

వీచే గాలికి తెలుసూ వీడని వలపు సుగంధం             

చూచే కనులకు తెలియదా కలిసున్న బంధం

కలిసిపోయే హృదయాలకు కాలం తెలియదే

అలసిపోని ఆశయం తీరం చేరికకే అలియదే


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance