ఎదలో ఊహలు
ఎదలో ఊహలు
ఎదలో ఊహలే ఎరుగని సౌఖ్యమే యిచ్చాయి
మొదలే కాని మోహాలకే సుఖాలనూ తెచ్చాయి
కనులలోని కాంతిరేఖలే కధలన్నిటిని చెప్పాయి
తనువులోని తమకమే తహతహలు విప్పాయి
ఎదలో ఊహలే ఎరుగని సౌఖ్యమే యిచ్చాయి
ఒకటా రెండా ఊరించే గుస గుసలు ఆ మదిలో
చీకటా ఎండా తేడాలేక ప్రవాహమైను హృదిలో
అంచనాలకి అందనిది అలుపే ఎరగని ఆ ప్రేమ
సంచలనాలకి చిరునామే ఆచూకి లేని ఆ లేమ
ఎదురుకు వచ్చి ఎంతో నచ్చి హాయిని పంచినా
కుదురుగ ఆమని కులుకులతో తననే ఎంచినా
ఎదలో ఊహలే ఎరుగని సౌఖ్యమే యిచ్చాయి
మొదలే కాని మోహాలకే సుఖాలనూ తెచ్చాయి
కలువరేఖల మెత్తదనం మత్తులో ముంచాయి
చెలియలేఖల కొత్తదనం పొత్తునే ఊరించాయి
ముందరే చేరిన ముసిమి అందరూ చూడగానే
తొందరే చేసి తొలి తోరణమై మెడలో పడగానే
విత్తుకునే వలపులు వింత పరుగులు చేసాయి
హత్తుకునే హృదయం ఆ హారతినే పట్టేసాయి
ఎదలో ఊహలే ఎరుగని సౌఖ్యమే యిచ్చాయి
మొదలే కాని మోహాలకే సుఖాలనూ తెచ్చాయి
ఊహలన్నీ ఊసులొలికితే ఉప్పెనా ఉలుకలేగా
దాహలన్నీ తీరకపోతే దరి చేరనీకా అలుకలేగా
ఎదనునిండిన కోరికలు ఎడబాటులేక తీర్చుకో
తుదను చేరక తూణీరమై మనసునే మార్చుకో
ఎదలో ఊహలే ఎరుగని సౌఖ్యమే యిచ్చాయి
మొదలే కాని మోహాలకే సుఖాలనూ తెచ్చాయి
కనులలోని కాంతిరేఖలే కధలన్నిటిని చెప్పాయి
తనువులోని తమకమే తహతహలు విప్పాయి