Ramesh Babu Kommineni

Romance

5  

Ramesh Babu Kommineni

Romance

తొలి తొలి ప్రేమ

తొలి తొలి ప్రేమ

1 min
410


ప౹౹


తొలి తొలి ప్రేమా తోరణమై అల్లెనుగా

తొలకరి పులకరింతే ఎక్కడో గిల్లెనుగా ౹2౹


చ౹౹


కారణమే తెలియదే కలలోను వదలదే 

తరుణమే రణమై రచ్చచేయక కదలదే ౹2౹

గిలి గిలి పెడుతుందే గుండెల్లో గుర్తుగా

గిలిగింతేపుడుతుందే ఉండి గమ్మత్తుగా౹ప౹


చ౹౹

అధరాలతో అల్లి ఎదలలోను గుచ్చేను 

అధరామృతాలే అదనంగాను పంచేను ౹2౹

వలపంటే వదనమంత చేసే సంతకమే

తలపడి తనువులూ గెలిచిన పతకమే ౹ప౹


చ౹౹

పగలే వెన్నెలకావించి ఊయలూగించు 

వగలే వన్నెలలు పూయించి వెలిగించు ౹2౹

తొలి తొలి ప్రేమకు తొందరా ఎక్కువేను

గిలి గిలి మనసులో పుట్టా మక్కువేను ౹ప౹



Rate this content
Log in

Similar telugu poem from Romance