చిరునామా!
చిరునామా!
తూరుపు కిరణం
మనసు తెడ్డుపై తేలుతూ
పదే పదే పలవరిస్తూ
నీ శ్వాసకు చేరువగా
నా గుండె సడి వినిపించేంత దగ్గరగా
ప్రేమ చిరునామా వ్రాసుకున్నా...
నింగిలోని చుక్కలన్నీ
చక్కని నీ మోము పై మెరుస్తూ
మైమరపిస్తూ చిలిపి దరహాసమై
కవ్విస్తుంటే
రేరాజులా చెంతచేరి నీ అధర
సంతకంగా
ప్రేమ చిరునామా వ్రాసుకున్నా...
జాలువారే జలపాతంలా
నీ పరువాల తరంగాలు
తుషార కెరటాలై
నాట్యం చేస్తుంటే
నీ చెక్కిలిపై లేలేత
ప్రేమ చిరునామా వ్రాసుకున్నా...
పచ్చని వాకిళ్ళలో
గుసగుసలాడుతూ
పరిమళించే సౌగంధికవనంలా
వయ్యారంగా విరబూసే
నీ నయన వెలుగు రేఖలపై
ప్రేమ చిరునామా వ్రాసుకున్నా....
శూన్యపు తీరాలు
దరిచేరకుండా
సంద్రమంత సంబరంగా
సప్తపదుల కలయికతో
నీ ఒడిలో సేదతీరే క్షణాలకై
శాశ్వత ప్రేమ చిరునామా నీ నుదుటిపై వ్రాసుకున్నా!
ఆ ప్రేమకు మనమే చిరునామాగా సాగిపోవాలని!!
ప్రేమతో...
నీ చిరునామా❤