కదిలే పరవశం
కదిలే పరవశం
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ప౹౹
కదిలే పరవశమా కలలోనూ తన్మయమే
మదిలో దాగిన మార్మికతకూ చిన్మయమే ౹2౹
చ౹౹
ఊహలే ఊపిరై ఉద్భవించి ఊసుపోనీదే
దాహాలే పెంచి దారి తెన్నునే కనపడనీదే ౹2౹
గూటిలోని చిలకమ్మ గుండెలోనే నిలిచినే
ఏటిలోని సుడి ఎదను చేరి బాగ అలసినే ౹ప౹
చ౹౹
గొంతులోని తీయని రాగం తీగలుగా సాగి
చెంతలేని చెలియ కోసమే తపించినే ఊగి ౹2౹
కనులెంత వేచినో కన్నార్పని స్థితికే ఎరుక
తనువెంత తల్లడిల్లెనో చెప్ప లేక ఆ కోరిక ౹ప౹
చ౹౹
ఊగిసలాడే మానసానికి ఉత్ప్రేరకం లేదా
సాగిలపడే సరసానికి సమయం కుదరదా ౹2౹
అనుకున్నదే జరిగేనని ఆశించుట తప్పేనా
కోరుకున్నదే కొరవడిన కృశించుట ఒప్పేనా ౹ప౹