మౌనం
మౌనం
మనసు లో ఎన్నో కబుర్లు మౌనం గా ఎదురు చూస్తున్నాయి
నీతో చెప్పి సంబరపడాలని,
కళ్ళల్లో కాంతులు ఎదురు చూస్తున్నాయి
నిన్ను చూసి మురిసిపోవాలని,
పెదవి పై చిరునవ్వు కాపు కాసి కుర్చుని ఉంది
పలకరిస్తే పసిపాప అవ్వాలని,
కనురెప్పలు ఆశగా చూస్తున్నాయి
నీ రూపం బందీ చెయ్యాలి అని.