స్వప్న సుందరి
స్వప్న సుందరి
"ఊహకు చేరువయ్యే స్వప్నానివో !!
జ్ఞాపకానికి దూరమయ్యే వాస్తవానివో !!!
కనులకు కనిపించే రూపానివో !!
స్పర్శకు కరువయ్యే ఛాయవో !!!
శ్రవణానికి వినిపించే శృతివో !!
శబ్దాన్ని సృష్టించే ధ్వనివో !!!
సంధ్యావేళ సేదతీర్చే తెన్నెలవో !!
నిశీధివేళ వెదజల్లే వెన్నెలవో !!!
హృదయానికి హత్తుకునే బంధానివో !!
మనసుని భగ్నపరిచే అందానివో !!!
ఎవరివో...??
నీవెవరివో...???"