"నిజమైన నువ్వు !"
"నిజమైన నువ్వు !"
ఎన్నో మాటలు గుండెలో దాచుకుని,
బయటపడలేక లోలోపల కుమిలిపోతున్నావా ?
నీ కళ్ళలో కనిపించే నిస్సహాయత,
అపార్థాల చీకటి తెరల వెనుక నీ నవ్వుని దాచేసావా ?
నువ్వు నిజమే చెప్పినా,
అది అబద్ధమై వినిపిస్తోందా ఈ లోకానికి ?
నువ్వు ప్రేమించినా,
అది స్వార్థంగా కనిపిస్తోందా ఈ సమాజానికి ?
ప్రతి పలుకూ అపార్థాల సుడిగుండమై,
నిన్ను మరింతగా అగాధంలోకి లాగుతోందా ?
ఎంత చెప్పినా తెలియని మౌన వేదన,
నీ గుండెను నలిపేస్తోందా నిత్యం ?
అర్థంకాని ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నా...
కన్నీరు కూడా నిన్నెందుకు అనుమానిస్తుందో కదా ?
ఒంటరితనం నీకు తోడై నిలిచినా,
నిజాయితీ నీలో దీపమై వెలిగినా...
ఈ అపార్థాల బరువు దిగిపోతేనే,
నిజమైన నువ్వు లోకానికి కనిపించగలవేమో కదా !
Written
By
Satya Pavan
