ఎంత చిత్రమో కదా !
ఎంత చిత్రమో కదా !
కనులముందు ఎంత చిత్రమో కదా !
కొండలు , గుట్టలు కదలనట్లే ఉంటాయి .
జీవులే పుట్టి , పెరిగి , కనుమరుగవటం .
అందులో సకల సౌఖ్యాలు పొందడం .
ప్రకృతిలో దొరికేవాటిని అనువుగా మలచటం .
ప్రయోజనంతో మరిన్ని తయారుచేయడం .
మట్టితో , చెక్కలతో , కొన్ని లోహాలతో .
పాలిమర్స్తో , మరికొన్ని సిలికాన్తో .
రసాయనశాస్త్రంలోని మూలకాల పట్టిక ;
అన్ని రకాల వస్తువులూ దాన్నిబట్టేగా !
పునర్వినిమయంతో మంచి పర్యావరణం ,
మేలుకుంటే మనిషి జీవితం శుభప్రదం !!
*** *** ***