అధరహో
అధరహో


* అధరహో *
గుప్పెడు గుండె గుప్పించే
ప్రియరాగాలకు సిగ్గులు తొడిగి
లేత గులాబీ రంగులద్ది
నీ పెదవుల్లో చేర్చుకున్నావా...!!
మీటగానే తనువంతా తపనల
స్వరాలు పలికించి మనసు
పులకింపచేసే తీగలేవో
నీ పెదవుల్లో దాచుకున్నావా....!!
సర్వేంద్రియాలకు జీవం పంచే
ఆరు రుచుల పదార్ధాలేవీ
చవిచూపలేని సమ్మోహనరసమేదో
నీ పెదవుల్లో తయారుచేసావా....!!
మృదుమధుర ప్రేమ పలుకుల మధువులొలికించే అధరాల
సుధలను చిలికి నీ మనసులో
అమరునిగా అమర్చుకున్నావా....!!
-ప్రశాంత్