STORYMIRROR

Javeed Syed

Abstract Classics Inspirational

5  

Javeed Syed

Abstract Classics Inspirational

అస్తిత్వ యుద్ధం లో

అస్తిత్వ యుద్ధం లో

1 min
373


ఉనికి నాదే వ్యక్తిత్వం నాదే,

కధ నాదే శీర్షిక నాదే,

అనామక ముఖాల ఈ ప్రపంచం లో,

మాయమైన నిజ స్వరూపం నాదే.


 

ఉనికి నాదే వ్యక్తిత్వం నాదే,

గమ్యం నాదే మార్గం నాదే,

అస్తిత్వాల భీకర పోరు లో,

గెలుపు నాదే ఓటమి నాదే.


 

ఉనికి నాదే వ్యక్తిత్వం నాదే,

దేహం నాదే మనస్సు నాదే,

చావు బ్రతుకుల వికట ఆటలో,   

కలలు నావే కన్నీళ్లు నావే.


ఉనికి నాదే వ్యక్తిత్వం నాదే,

పరువు నాదే ప్రతిష్ఠా నాదే,

కపటత్వంతో నిండిన ప్రపంచంలో,

చీకటి నాదే వెలుతురూ నాదే.


ఉనికి నాదే వ్యక్తిత్వం నాదే,

ఆకలి నాదే బోలు కడుపు నాదే,

పరుగులుతీసే ఈ ప్రపంచంలో,

బరువు నాదే బాధ్యత నాదే.


ఉనికి నాదే వ్యక్తిత్వం నాదే,

అక్షరం నాదే పుస్తకం నాదే,

రహస్యాలు దాగున్న ఈ గ్రహాలలో,

విశ్వం నాదే సర్వం నాదే.




Rate this content
Log in

Similar telugu poem from Abstract