నాలుక చీలిక!
నాలుక చీలిక!
కంటి భాషఇప్పుడు కళ్ళే మాట్లాడుతున్నాయి కనిపించని విపత్తు తో మాస్కు లతో చేసే యుద్ధంలో!ఇప్పుడిక్కడ లోపల సునామీలా తెరుచుకుంటున్న మెత్తని భయం.కత్తి అంచున ప్రాణాన్ని నిలబెట్టినట్లు సాటి మనిషిని చూస్తేనే హడల్!కరచాలనాలూ మృత్యుచాలనాలు అవుతుంటే ,దూరమైన దేహాలు హృదయాలను దగ్గర చేసుకోవడానికి కళ్ళతోనే మాట్లాడుతున్నాయి.లోపల ఉబికే కరుణను,ఏమీ సహాయం చెయ్యలేని నిస్సహాయతను,దేహం మోసే దుఃఖాన్ని,దగ్గరకు తీసుకోలేని పేదరికాన్ని ,కంటి కాన్వాస్ మీదే గీతలుగా గీసి చూపుతున్నాయి.ఫర్లేదు ,నాలుకైతే మాటను రెండుగా చీలుస్తుంది కానీకంటి భాష ఒక్కదారిలో పోయే కాంతికిరణంఇప్పుడే కాదు ఎప్పుడూ కళ్ళే మాట్లాడుకోవాలి. @@@@@ ...వాయుగుండ్ల శశికళ. నాయుడుపేట.