STORYMIRROR

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

5  

VENKATALAKSHMI N

Abstract Fantasy Others

మాటలు రాని వేళ

మాటలు రాని వేళ

1 min
399

మనసు మౌనరాగం పాడుతుంటే..

మాటలు మౌనాన్ని ఆశ్రయిస్తే...

ఆ మౌనం ఎంత మధురం కదా!

మరచిపోని జ్ఞాపకాలు

వీడిపోని విరహవేదనలు

వీగిపోని ఉఛ్వాసనిశ్వాసాలు

రెప్పల తీరం దాటని కలలు

కంటిపాప కోరే స్వప్నాలు

విరహాల ఉప్పెనలు

మౌనం నిండా పరుచుకుని

మనసును ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే

కన్నీటి అలలు,నిట్టూర్పుల సెగలు

ఉత్తుంగ తరంగాలై ఎగసిపడుతుంటే

దిక్కు తోచక ఓపలేని ఒంటరితనంతో

గుండెలయ నిశ్శబ్ద యుద్ధం చేస్తుంది 

తలుపులన్నీ తలక్రిందులయి

వడగాల్పులుగా తాకుతున్నాయి

వేసవి గాలులతో కలిసిపోయాయి

కట్టిన కోటలు బీటలు వారి కళ తప్పి

మొండిగోడలా మనసు నిలిచిపోయింది



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Abstract