జీవితం
జీవితం


జీవితం సముద్రం కన్నా లోతైనది
ఆకాశం కన్నా విశాలమైనది
తేన కన్నా మధురమైనది
వేప కన్నా చేదైనది
వజ్రం కన్నా విలువైనది
ప్రకృతి కన్నా అందమైనది
అమ్మ ఒడి అంత హాయి యైనది
ముళ్ళ దారంత బాధైనది
వికసిస్తున్న పువ్వు వంటిది
వర్షిస్తున్న మేఘం వంటిది
గమ్యాన్ని చేరాలని తపిస్తుంది
గగనానికి ఎగరాలని ఆశిస్తుంది
కాలంతో పాటు పరుగులు తీస్తుంది
కాలానుగుణంగా మార్పును తెచ్చుకుంటునది
దాని సారాంశం అర్ధం అయినట్టే ఉంటుంది
కాని ఓ ప్రశ్న పత్రంలా నిలిచే ఉంటుంది
సమాధానాన్ని తెలుసుకోవటం కోసం
దాన్ని అనుభవించేలా చేస్తుంది