ఇప్పుడు ఒంటరి గా నేను
ఇప్పుడు ఒంటరి గా నేను
నది ఒడ్డున నిలిచిన ఓడలా
జలపాతంలా జారుతు కంటి చివరన ఆగిన కన్నీటి బిందువులా
ప్రవహంలా కొట్టుకొస్తూన్నా అంతుపట్టని ఆలొచనలా
కబుర్లు చెప్పలేని మూగదానిలా
మనసు గాయాన్ని సరిదిద్దలేని వైద్యునిలా
రాగాలను పలికించలేని గాయనిలా
జీవితాన్ని మెప్పించలేని నటిలా
శరీరంలో స్పండనలేని జీవతసవంలా
కాంతిని ప్రదర్సించలేని అమావాస్య చంద్రునిలా
పుష్పంలా విచ్చుకోలేని పసిడి మొగ్గలా
అమృతాన్ని సేవించలేని దేవకాన్యలా
కాకి గూటిలో చిక్కుకుపోయిన కోయిలలా
గమాయనికి దారి తెలియని బాటసారిలా
ఈ క్షణం ఒంటరిగా మిగిలిపోయా నేనిలా