చాచుతోంది మృత్యుహస్తాన్ని
చాచుతోంది మృత్యుహస్తాన్ని


చాచుతోంది మృత్యుహస్తాన్ని
--------------------------------------
యుగయుగాలుగతిస్తున్నా...
విజ్ఞానశాస్త్రంశోథిస్తూన్నా
లెక్కకందని గ్రహగోళాలతో
ఊహకందని రహస్యాలతో
కనిపించీ కనిపించకుండా....
మానవమేథస్సును
తికమకపెడుతున్నట్టి...
అంతుచిక్కని అంతరిక్షంపై
ఆధిపత్యం సాధించడానికై.....
వైజ్ఞానికప్రయోగాలతో
స్వార్థాన్విత వ్యూహాలతో
పోటీపడుతున్నాయ్ దేశాలన్నీ.....
అతివేగంగా నిరవధికంగా
ప్రపంచవ్యాప్తంగా
*******
నింగిపైకి ఎగరాలన్నా
తిరిగి కిందికి దిగాలన్నా
అవసరమైన
స్థావరమైన భూమిపై.....
తరతరాలుగ
పెరిగేందుకు
నరజాతికి వరముగ దొరికిన
ధరణీగోళం సంక్షేమంపై
మానవజీవన నిర్వహణంపై...
పట్టుకోల్పోతోంది దారుణంగా మానవవ్యవస్థ క్రమక్రమంగా!!
** ** **
వికటించిన జీవనసరళి...
సృష్టిస్తోంది విషప్రళయాన్ని!
విస్తరిస్తున్న విషప్రళయం....
చాచుతోందిమృత్యుహస్తాన్ని
కబళించేందుకు కర్కశంగా
మానవవైభవసమస్తాన్ని!
ఎగరటానికై ఎదగటానికై
చూపులెప్పుడూ పైపైకేనా?
ఆరోగ్యంగా బ్రతకడానికై
దృష్టిసారించు దేహంపైన!
మానవా!మారు ఇకనైన!!
గాదిరాజు మధుసూదన రాజు