ఇటు రావా మేఘమా
ఇటు రావా మేఘమా
శుష్కనేలలు
ఎండిన చెరువులు
పారని వంకలు
రైతుల వెతలు మా సీమలో.
రాలని చినుకులు
రాని కునుకులు
నీటి సమస్యలు
కరువు నృత్యాలు మా సీమ లో
నేతల హామీలు
వలసల బతుకులు
అప్పుల బాధలు
పండవు పంటలు మా సీమలో
కనుక ఓ చినుకమ్మా..!
నిండు చూలాలైన మేఘమై
మా సీమనేలపై కమ్ముకొని
చినుకుల ధారను ప్రసవించు
కరువు సీమను కరుణించి
కమ్మనైన పంటలు పండించు
ఎడారి కాబోతున్న నా సీమను
నీ చల్లని చూపుతో అనుగ్రహించి
వర్షపు జల్లులతో అభిషేకించు
ఇటురావా మేఘమా..!!
మా మోర ఆలకించవా..!!
మా కన్నీటిని తుడిచేందుకు రావా ఓ చల్లని మేఘమా...