అమ్మ మాయమైపోతోoది..
అమ్మ మాయమైపోతోoది..


ఆరేళ్ళ వయసులోనే
ఏసీ హాస్టల్ వైపు అడుగుగులు
చేతి వేళ్ళు నిలవక ముందే
నీట్ సెట్ ల వైపు పరుగులు
తల్లి లాలన తండ్రి పాలన
అమ్మా నాన్నా అన్న పిలుపు
బాబూ చిన్నా కన్నా అన్న
తల్లిదండ్రుల కమ్మని లాలింపు
క్రమంగా కనుమరుగైపోతున్నాయి
ఆయా క్రమంగా అమ్మైపోతోoది
అమ్మ క్రమంగా మాయమైపోతోoది