STORYMIRROR

SATYA PAVAN GANDHAM

Abstract Tragedy Classics

4  

SATYA PAVAN GANDHAM

Abstract Tragedy Classics

మాగోడు...!(మూగ జీవాల గొంతుక)

మాగోడు...!(మూగ జీవాల గొంతుక)

2 mins
244

మాగోడు వినండొయ్...! మాగోడు వినండొయ్...!!

ఓ మనసున్న మనుషుల్లారా...!

నోటమాట లేని ఈ మూగ జీవాల గోడు కాస్త వినండొయ్...!!

గగనపు అంచులే హద్దులై ఎగురుతుండంగా...!

పంజరంలో బంధించి మాకా స్వేచ్ఛ లేకుండా చేశారోయ్...!!

ప్రకృతి పవనాలే తోడై సాగుతుండంగా...!

జీ మొదలుకుని 5 జీ వరకూ మీరు ప్రవేశపెట్టిన

ఆ సాంకేతిక ఉచ్చులోకి దించి చివరకు మాకున్న

ఆ ఒక్క "జీ"వాన్నే ప్రశ్నార్థకం చేశారోయ్...!!

ఉదయపు భానుడి ప్రభాత కిరణాలపై నాట్య మాడే మా జాడ మాయమవడానికి కారణమెవరోయ్...?

వేకువ కిల కిల రావలతో మీ శ్రవనాలను ఆహ్లాదకపరిచే మా శృతులు ఆగిపోవడానికి కారకులెవరోయ్...??

మా అందమే మాకు శాపమా..?

లేక మీ అభివృద్ధే మాకు లోపమా..??

                            **********

మాగోడు వినండొయ్...! మాగోడు వినండొయ్...!!

ఓ మనసున్న మనుషుల్లారా...!

నోటమాట లేని ఈ మూగ జీవాల గోడు కాస్త వినండొయ్...!!

గుమ్మం ముందు కాపలాకి ఈ పెంపుడు జంతువు కావాలి..!

ఎంత నీతిగా పనిచేసినా ఆ గుమ్మం బయట ఈ జంతువు స్థానం ఎప్పటికీ మారదండోయ్...!!

మీకు పాలిచ్చెందుకు ఈ పశువు కావాలి..!

ఎన్ని పోషకాలు అందించిన ఈ పశువు పై ఆ కొరడా దెబ్బలు మాత్రం ఎన్నటికీ ఆగవండోయ్...!!

అతి జ్ఞానంతో సభ్య సమాజం తల దించుకునే పని చేసేది మీరెనోయ్...!

"పశువా..." " జంతువా.." అంటూ మాతో పోలుస్తూ

పాపం పుణ్యం ఎరగని మాపై నీలాపనిందలెంటోయ్ ..!!

"పశువు" అనే పదం మీకెప్పటికీ ఓ అసహ్యమెనోయ్..!

పైగా ఆ పదంతో పోలిస్తే ఏ మనిషీ జీర్ణించుకోలేడోయ్ ...!!

పందాలు కాయడానికా..? బరువులు మోయడానికా..?

బలి ఇచ్చేటందుకా...? జాలి పడెందుకా మా బ్రతుకులు ...?

వాటిక్కూడా మీ బోటి విలువే కలదని ఇకనైనా గుర్తించగలరా..??

                           **********

మాగోడు వినండొయ్...! మాగోడు వినండొయ్...!!

ఓ మనసున్న మనుషుల్లారా...!

నోటమాట లేని ఈ మూగ జీవాల గోడు కాస్త వినండొయ్...!!

సవాళ్ల పేరుతోనో, ప్రముఖుల పిలుపుతోనో

ఎప్పుడో ఒకప్పుడు మీ పెరట్లో ఓ మొక్క నాటి చేతులు దులుపుకుంటారోయ్ ...!

మాకు దాహమేస్తే వాన నీరే దిక్కు మొక్కాయేరోయ్...!!

ఆ వాన నీరైనా పుడమికి చేరాలంటే అవసరం మా పూర్వీకులేనొయ్ (వృక్షాలు)...!

మీ అవసరాల కోసం వాటిని సైతం నిర్ధాక్షణ్యంగా మట్టు బెడుతున్నారోయ్...!!

మీరు చేసిన పాపాలకే ఈ ప్రకృతి అంతరించిపోతుంటే, పర్యావరణ పరిరక్షణ పేరుతో మరలా మీరే వీధుల్లోకొచ్చి పిలుపునివ్వడం మీకు హాస్యాస్పదంగా అనిపించడం లేదా?

నోరుంటే మా హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసేటోల్లమోయ్...!

కానీ, ఆ బ్రహ్మే పక్షపాతం చూపి మాకు తీరని ద్రోహం చేశాడోయ్ ...!!

మాకే కాదు, మా మనుగడ లేకపోతే అది మీకు కూడ లోటే అవుతుందన్న విషయం మరువకొయ్ ఓ బుద్ధి ఎరిగిన మా"నవ" మైత్రి...!!!

మాగోడు వినండొయ్...! మాగోడు వినండొయ్...!!

ఓ మనసున్న మనుషుల్లారా...!

నోటమాట లేని ఈ మూగ జీవాల గోడు కాస్త వినండొయ్...!!

-Satya Pavan Writings ✍️✍️✍️



Rate this content
Log in

Similar telugu poem from Abstract